“గేమ్ చేంజర్” ఫస్ట్ సింగిల్ ఇంకెప్పుడు?

“గేమ్ చేంజర్” ఫస్ట్ సింగిల్ ఇంకెప్పుడు?

Published on Dec 7, 2023 2:00 PM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఓ కీలక షెడ్యూల్ తో కంప్లీట్ అవుతుండగా ఈ చిత్రం నుంచి ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ కోసం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఈ సాంగ్ లీక్ అయ్యింది. వెంటనే మేకర్స్ కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

కానీ లాస్ట్ మినిట్ లో సాంగ్ ని రిలీజ్ చెయ్యట్లేదు తెలిపి డిజప్పాయింట్ చేశారు. ఇక మళ్ళీ ఈ సాంగ్ రిలీజ్ ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు. అయితే ఈ సాంగ్ ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రావచ్చని బజ్ వచ్చింది. కానీ ఇపుడు ఈ సాంగ్ అప్పుడు కూడా రాకపోవచ్చని జనవరిలో ఉండొచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ జరగండి సాంగ్ పై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది అని చెప్పాలి. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు అప్డేట్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు