‘విశ్వంభర’కు మోక్షం ఎప్పుడు..?

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలని మేకర్స్ భావించినా, తాజా పరిస్థితుల ప్రకారం అది కష్టంగానే కనిపిస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం హరి గౌర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

మరోవైపు, ఈ సినిమా ఓటీటీ డీల్‌ను ముగించడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారింది. విఎఫ్ఎక్స్ షాట్స్ పూర్తికాగానే ఫైనల్ ఎడిటింగ్‌ను లాక్ చేసి, టాప్ డిజిటల్ సంస్థలకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిన తర్వాతే అధికారిక విడుదల తేదీపై స్పష్టత రానుంది.

ప్రస్తుతానికైతే ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ ప్లాన్‌పై క్లారిటీ లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఇప్పటికే వేరే సినిమాలతో ప్యాక్ అయిపోతుండటంతో మెగాస్టార్ సినిమా సేఫ్‌గా థియేటర్లలోకి రావాలంటే ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించాల్సి ఉంది.

Exit mobile version