అలాంటి ఐకానిక్ రోల్ లో మహేషే బాకీ ఉన్నాడు.!

Published on Sep 15, 2020 9:01 am IST

మన టాలీవుడ్ లో హాలీవుడ్ కటౌట్స్ గా చెప్పుకోబడే అతి కొద్ది మంది హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అయితే మహేష్ ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. క్లాస్, మాస్ మెసేజ్ ఓరియెంటెడ్, కౌ బాయ్ రోల్స్ లాంటి ఎన్నో డిఫరెంట్ చిత్రాల్లో మహేష్ కనిపించి మెప్పించారు.

అయితే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో మంచి ఊపందుకున్న ఐకానిక్ రోల్స్ కొన్ని ఉన్నాయి. అవే పలు పీరియాడిక్ రోల్స్. కేవలం ఒక వారియర్ రోల్ గా మాత్రమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల రోల్స్ కూడా ఈ మధ్య దాదాపు మన స్టార్ హీరోలు అందరు టచ్ చేసేసారు.

మహేష్ కు అత్యంత సన్నిహతులు అయిన రామ్ చరణ్, తారక్ అంతెందుకు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఐకానిక్ రోల్స్ లో కనిపిస్తున్నారు. అలాగే లేటెస్ట్ ట్రెండ్ లో భాగంగా మహేష్ నుంచి కూడా ఒక సరైన పీరియాడిక్ సినిమా కానీ పడితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా స్కై హై లెవెల్లో ఉంటుంది. మరి మహేష్ ను అలాంటి ఐకానిక్ రోల్ లో ఏ దర్శకుడు ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More