‘విజిల్’కి సెన్సార్ పూర్తయింది !

‘విజిల్’కి సెన్సార్ పూర్తయింది !

Published on Oct 24, 2019 6:26 PM IST

Bgil

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘విజిల్’. కాగా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న ఈ సినిమా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ స్పోర్ట్స్ డ్రామా సన్నధం అవుతుంది.

ఇక విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా విజిల్ ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. హీరో విజ‌య్‌ కెరీర్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.

తాజా వార్తలు