ఆ ఆరుగురిలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఆ ఆరుగురిలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేదెవరు?

Published on Jul 27, 2019 12:23 PM IST

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వెండితెర,బుల్లితెర తెరకు చెందిన 15మంది సెలెబ్రిటీలు ఇంటి సభ్యులుగా బిగ్ బాస్ 3 రియాలిటీ షో గత ఆదివారం గ్రాండ్ గా మొదలైపోయింది. వివాదాలు, కోపాలు,నిట్టూర్పులు,ఏడుపులు మధ్య విజయవంతంగా ఒకవారం కూడా పూర్తి చేసుకుంది. కాగా ముఖ్యమైన ఎలిమినేషన్ రౌండ్ కి టైం దగ్గిరపడింది. దీనితో ఎలిమినేషన్ కి నామినేట్ ఐన ఇంటి సభ్యులలో టెంక్షన్ మొదలైంది.

ఈవారానికి గాను ఎలిమినేషన్ కొరకు మొత్తం ఆరుగురు సభ్యలు నామినేట్ కావడం జరిగింది. వారిలో నటి హేమ,మరో నటి హిమజ, పూర్ణవి భార్గవి, సింగర్ రాహుల్ సిప్లిగుంజి, టీవీ9 రిపోర్టర్ జాఫ్ఫర్ తోపాటు హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితికా షేరు ఉన్నారు. ఇప్పుడు వీరిలో అతితక్కువ ఓట్లు సంపాదించిన ఇంటిసభ్యడు ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది.

మొదటివారమే ఇంటి నుండి ఎలిమినేట్ చేయబడినవారు దురదృష్టవంతులనే చెప్పాలి. కారణమేదంటే వారు షోలో పూర్తిగా మమేకమై, తమ ప్రతిభ చూపే లోపే వెళ్ళిపోతారు. ఇది జస్ట్ మొదటి వారమే కాబట్టి బిగ్ బాస్ ఎలిమినేషన్ జరుపకపోవచ్చు. మరి ఈవారం ఏమి జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు