చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో మెరిసిన ఈ ‘సీరియల్’ బ్యూటీ ఎవరో తెలుసా? – సాయి ప్రియా రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు!

చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో మెరిసిన ఈ ‘సీరియల్’ బ్యూటీ ఎవరో తెలుసా? – సాయి ప్రియా రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు!

Published on Feb 13, 2026 1:58 PM IST

Sai Priya Reddy Mana Shankara Vara Prasad Gaaru

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి పండుగకు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఆడియెన్స్‌ను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్న అంశాల్లో ‘టీవీ సీరియల్’ ట్రాక్ ఒకటి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక సీరియల్ రన్ అవుతూ ఉంటుంది. అందులో మన శంకర వర ప్రసాద్ గారి పాత్రలో చిరంజీవి.. ఆ సీరియల్ గురించి, అందులోని క్యారెక్టర్ల గురించి చెప్పే డైలాగ్స్ చాలా ఫన్నీగా వర్కౌట్ అయ్యాయి. ఆయన లైఫ్ ఆ సీరియల్‌తో లింక్ అయినట్లు చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే, ఆ సీరియల్‌లో ‘సౌమ్య’ అనే హీరోయిన్ పాత్రలో కనిపించిన అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరంటూ నెటిజన్లు గూగుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఆమె పేరే సాయి ప్రియా రెడ్డి (Sai Priya Reddy). ఈమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు, మనకు బాగా తెలిసిన మొహమే. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పెద్ద సినిమాల్లో నటించింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి, యూట్యూబ్ (YouTube)లో పలు వెబ్ సిరీస్‌లు చేసి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

రీసెంట్‌గా విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమాలో కూడా సాయి ప్రియా కనిపించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో నటించే మంచి ఛాన్స్ దక్కింది. ఆ సీరియల్ ఎపిసోడ్స్ ద్వారా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో హీరోయిన్‌గా లేదా కీ రోల్స్ చేసే అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో సాయి ప్రియా భాగం అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Sai Priya Reddy Mana Shankara Vara Prasad Gaaru

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు