ఈవారం బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పేది ఎవరంటే….?

ఈవారం బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పేది ఎవరంటే….?

Published on Sep 21, 2019 7:01 PM IST

బిగ్ బాస్ షో మరో వారాంతానికి చేరింది. నేడు శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గతవారం రోజులుగా ఇంటి సభ్యుల ప్రవర్తనను గమనిస్తున్న ఆయన వారివారి ప్రవర్తనల ఆధారంగా సమీక్షలు జరపనున్నారు. అలాగే ముఖ్యమైన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరగనుంది. మరి ఈ వారం ఎలిమినేషన్ కొరకు ఎంపికైన సభ్యులలో ఒకరు హౌస్ నుండి బయటకి వెళ్లనున్నారు.

ఈవారం ఎలిమినేషన్ కి గాను రాహుల్, హిమజ, మహేష్ నామినేట్ చేయబడ్డారు. మొన్న ఎపిసోడ్ లో మహేష్ కెప్టెన్ గా బాధ్యలు స్వీకరించడంతో ఆయన ఎలిమినేషన్ నుండి తప్పించుకునే అవకాశం కలదు. దీనితో మిగిలిన ఇద్దరు సభ్యులైన రాహుల్, హిమజలలో ఒకరు షోకి గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు ఎక్కువ కలవు. రాహుల్, హిమజ లలో కూడా హిమజా నే ఈ ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువని తెలుస్తుంది. మరి చూడాలి ఈ వారం ఎవరు బ్యాగ్ సర్దుకోవాల్సివస్తుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు