వారిద్దరిలో ఫైనల్ గా ఆమెనే తీసుకున్నారా?

Published on Apr 1, 2020 9:34 pm IST

సామాజికవేత్త, ప్రముఖ కర్నాటిక్ సింగర్ మరియు విద్య వేత్త అయిన బెంగుళూర్ నాగరత్తమ్మ బయోపిక్ పై కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తుంది. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోనాగరత్తమ్మ గా స్వీటీ అనుష్క చేస్తున్నారంటూ ప్రముఖంగా వినిపించింది. అనేక మాధ్యమాలలో దీనిపై వార్తలు రావడం జరిగింది. అలాగే మరో టాలీవుడ్ టాప్ హీరోయిన్ పేరు కూడా ఈ బయో పిక్ కొరకు వినిపించింది.

లక్కీ లేడీ సమంతను నాగరత్తమ్మ బయోపిక్ లో హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే అనుష్క, సమంత లలో దర్శకుడు ఎవరిని తీసుకున్నారు అనే విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం నాగరత్తమ్మ బయోపిక్ కొరకు సమంతనే ఫైనల్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కొద్దిరోజులలో అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రెస్టీజియస్ బయో పిక్ లో హీరోయిన్ ఎవరనేది సందిగ్దమే.

సంబంధిత సమాచారం :

X
More