త్రివిక్రమ్ ఆ రోజు ఎందుకు రాలేదంటే..

నితిన్ నటిస్తోన్న చల్ మోహన్ రంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వచ్చారు. కాని త్రివిక్రమ్ ఈ ఫంక్షన్ కు రాలేదు. దీంతో మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఈ సినిమా ప్రమొషన్స్ లో భాగంగా నితిన్ ఈ విషయంపై స్పందించారు..

త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు రావాలనే అనుకున్నారు కాని ఆ సమయంలో ఆయన తీవ్ర జ్వరంతో భాధ పడుతున్నాడని అందుచేత ఫంక్షన్ కు హాజరు కాలేకపోయాడని చెప్పారు నితిన్. తమన్ అందించిన ఈ సినిమాలోని పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా శ్రేస్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ సంస్థల్లో పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version