ట్రైలర్ తో రానున్న ‘వైల్డ్ డాగ్’ !

Published on Mar 7, 2021 7:18 pm IST

కింగ్ అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. కాగా ఈ వైల్డ్ డాగ్ ట్రైలర్ మార్చి 12 న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. హిమాలయాల్లాంటి టఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :