శ్రీమన్నారాయణ ‘కె.జి.ఎఫ్’ రేంజ్ హిట్ అందుకుంటాడా ?

శ్రీమన్నారాయణ ‘కె.జి.ఎఫ్’ రేంజ్ హిట్ అందుకుంటాడా ?

Published on Dec 30, 2019 8:16 AM IST

Athade

కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేకపోయినా ఆయన కొత్త సినిమా ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమా టీజర్ ట్రైలర్ లు బాగుండటంతో ఈ సినిమా పై తెలుగు ప్రేక్షుకుల్లో కూడా బాగానే ఆసక్తి ఏర్పడింది. సినిమా కూడా ఇంట్రస్టింగ్ నేపథ్యంలో రాబోతుండటంతో తెలుగులో కూడా సినిమా పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు జనవరి 1న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని విడుదల చేయనున్నారు. దిల్ రాజు పేరు తోడవ్వడంతో సినిమాకి ఇంకా క్రేజ్ పెరిగింది. మరి ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో వస్తాయా.

పైగా ఈ సినిమాను కన్నడం, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ సినిమా ద్వారా కన్నడ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి గుర్తింపు రావడంతో మిగిలిన భాషల్లో కూడా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ని భారీగా ప్లాన్ చేశారు. మరి ‘కె.జి.ఎఫ్’లాగే ‘అతడే శ్రీమన్నారాయణ’ కూడా ఇతర భాషల్లో ఆ రేంజ్ హిట్ ను అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు