చరణ్, ఆలియా కాంబినేషన్ రిపీట్ కానుందా ? ‌

Published on Mar 16, 2021 9:40 am IST

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ‘దిల్‌’ రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ గా రష్మికా మందన్నా, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. రామ్‌చరణ్, ఆలియా భట్ మరోసారి మళ్ళీ కలిసి నటించబోతున్నారనే టాక్‌ నడుస్తోంది. ప్యాన్‌ ఇండియా సినిమాతో చరణ్, ఆలియా కాంబో మళ్ళీ రిపీట్‌ అయితే సినిమాకి అదనపు క్రేజ్ రావడం ఖాయం.

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)లో చరణ్‌–ఆలియా జంటగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ ‌లో రామ్‌చరణ్‌–ఆలియా భట్‌పై రెండు పాటలు చిత్రీకరించేందుకు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేశారట. ఈ ఏడాది అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :