
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజులుగా కోరుకుంటున్న సూపర్ సక్సెస్ ని తన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తీసిన ‘పటాస్’ రూపంలో వచ్చింది. దాంతో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతని టీం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పటాస్ విడుదలైన అన్ని చోట్లా హౌసె ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. వీటన్నిటికి తోడు లాంగ్ వీకెండ్ తోడవడంతో ఆంధ్ర, తెలంగాణాలో కలయన్ రామ్ కెరీర్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ అనిల్ రావిపూడి కంటెంట్ ని చాలా బాగా డీల్ చేసినందుకు కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాను. త్వరలోనే మా కాంబినేషన్ లో మరో సినిమా ఉంటుంది. కానీ అది డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది. పటాస్ రిలీజ్ కి ముందే ఈ సినిమాపై నిర్ణయం తీసుకున్నాం.స్క్రిప్ట్ పై నాకు నమ్మకం ఉంది, ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ కి కొత్త అనుభూతిని ఇస్తుందని’ అన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత కళ్యాణ్ రామ్ ‘షేర్’ షూటింగ్ లో పాల్గొంటాడు.

