
‘పటాస్’ విజయంతో పరమానందంలో వున్న నటుడు కళ్యాణ్ రామ్. గత కొన్నేళ్ళుగా ఎదురుచూసిన విజయం ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ ని వరించింది. బాక్స్ ఆఫీస్ వద్ద కెరీర్ బెస్ట్ కలెక్షన్లకు కళ్యాణ్ రామ్ సిద్ధపడుతున్నాడు. మరో రెండు రోజుల్లో పెట్టిన మొత్తం తిరిగొచ్చేసి ఆ తర్వాత లాభాలను వెనకేసుకోవచ్చని ట్రేడ్ పండితుల విశ్వాసం.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనీల్ రావిపూడి పనితనాన్ని మెచ్చుకున్న కళ్యాణ్ రామ్ మరోసారి ఈ కాంబినేషన్ లో కొత్త జోనర్ తో ఒక సినిమా తీస్తామని మాటిచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరి కాంబినేషన్ లో రెండవ చిత్రం ”పటాస్” విడుదలకు ముందే ఖరారయిందట. స్క్రిప్ట్ ఎంతగానో నచ్చిందని, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారాని కళ్యాణ్ రామ్ తెలిపాడు.