“పుష్ప 2” మొదటి పాట.. దేవీ వారిని తప్పని ప్రూవ్ చేస్తాడా

“పుష్ప 2” మొదటి పాట.. దేవీ వారిని తప్పని ప్రూవ్ చేస్తాడా

Published on May 1, 2024 9:04 AM IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు మ్యూజికల్ హిట్ కాంబినేషన్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ లో ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది. అసలు వీరి కాంబినేషన్ అంటేనే ఒక చార్ట్ బస్టర్ ఆల్బమ్. అలా ఆర్య, ఆర్య 2 లతో అదరగొట్టి హ్యాట్రిక్ ఆల్బమ్ గా “పుష్ప” అంటూ వచ్చి పాన్ ఇండియా ఆడియెన్స్ ని షేక్ చేశారు. అయితే ఇపుడు ఫైనల్ గా “పుష్ప 2” నుంచి మొదటి పాట రాబోతుంది.

దీని సంబంధించి వచ్చిన మొదటి ప్రోమోకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఈరోజు ఫుల్ సాంగ్ బయటకి రానుంది. అయితే గతంలో కూడా పుష్ప 1 ఆల్బమ్ కి దాదాపు ప్రతి సాంగ్ కి ముందు అలానే టాక్ వచ్చి తర్వాత సూపర్ హిట్ అయ్యాయి. మరి ఇప్పుడు రానున్న ఫస్ట్ సింగిల్ కి కూడా అలాగే హిట్ అయ్యి ట్రోల్స్ చేసిన వారు తప్పని ప్రూవ్ చేస్తుందేమో చూడాలి. దేవి గత సినిమాకి అలానే చేసాడు మరి ఈ సినిమాకి ఏం చేస్తాడో ఈ సాయంత్రం వరకు ఆగి వినాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు