నార్త్ లో మెగా హీరో సినిమాకి ఎఫెక్ట్ పడుతుందా?

నార్త్ లో మెగా హీరో సినిమాకి ఎఫెక్ట్ పడుతుందా?

Published on Feb 22, 2024 7:02 AM IST

మెగా కాంపౌండ్ నుంచి ఉన్న హీరోస్ లో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. మరి హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాలని కొనసాగుతున్న వరుణ్ నటించిన లేటెస్ట్ చిత్రమే “ఆపరేషన్ వాలెంటైన్”. మరి ఈ చిత్రం నిజ జీవితం సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా అని తెలిసిందే.

అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్ మాత్రం సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. మెయిన్ గా మన టాలీవుడ్ నుంచి మరో బెస్ట్ క్వాలిటీ ఉన్న సినిమా వస్తుంది అని అర్ధం అయ్యింది. మరి ఈ చిత్రాన్ని తెలుగు సహా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి నార్త్ లో కూడా వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

కానీ నార్త్ లో ఆపరేషన్ వాలెంటైన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. జస్ట్ గత నెల లోనే ఇదే సినిమా నేపథ్యంలో హృతిక్ రోషన్ నటించిన “ఫైటర్” వచ్చింది. ఇంతలో మళ్ళీ ఈ సినిమా దీనితో అక్కడ వారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమాకి ఫైటర్ ఎఫెక్ట్ ఉంటుందో లేదో అనేది ఈ మార్చ్ 1 వరకు ఆగి చూస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు