“కల్కి 2898 ఎడి” ఈ ఫార్మాట్ రిలీజ్ కూడా??

“కల్కి 2898 ఎడి” ఈ ఫార్మాట్ రిలీజ్ కూడా??

Published on May 28, 2024 9:01 AM IST

ఇప్పుడు ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేసిన క్రేజీ సై ఫై ఫాంటసీ చిత్రం “కల్కి 2898 ఎడి” అనే చెప్పాలి. వినూత్న ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ఈ భారీ చిత్రం రిలీజ్ ఇప్పుడు దగ్గర పడుతుంది.

అయితే ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ లో ఇంకా ఏయే ఫార్మాట్ లలో రిలీజ్ అవుతుంది అనేది ఇంకా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇది లార్జర్ దన్ లైఫ్ సినిమా కాబట్టి ఐమ్యాక్స్ రిలీజ్ ని కూడా చాలా మంది ఆశిస్తారు. అంతే కాకుండా ఇలాంటి సినిమాని 3డి లో కూడా ఎక్స్ పీరియన్స్ చేయాలనీ చాలా మందిలో ఉంటుంది.

కానీ ప్రస్తుతానికి అయితే ఈ రెండు ఫార్మాట్ లలో దేనిపై కూడా అధికారిక క్లారిటీ లేకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ చిత్రం 3డి లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటూ బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇదైనా జరిగితే మూవీ లవర్స్ కి ఈ భారీ చిత్రం నుంచి మరింత మంచి ఎక్స్ పీరియెన్స్ వస్తుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు