కృష్ణ మహేష్ ని 4ఏళ్లకే దించాడు, మరి మహేష్ గౌతమ్ ని?

కృష్ణ మహేష్ ని 4ఏళ్లకే దించాడు, మరి మహేష్ గౌతమ్ ని?

Published on Sep 4, 2019 7:06 AM IST

సూపర్ స్టార్ కృష్ణకు చిత్ర పరిశ్రమలో అరుదైన గుర్తింపు ఉంది. నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విశిష్ట స్థానం సంపాదించారు. అనేక ప్రయోగాత్మక చిత్రాలలో నటించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

ఆయన తన నట వారసుడైన మహేష్ ని 4ఏళ్లకే వెండి తెరకు పరిచయం చేయడం గమనార్హం. మహేష్ నాలుగేళ్ళ వయసులో 1979లో విడుదలైన నీడ చిత్రంలో మొదటిసారి బాలనటుడిగా కనిపించారు. ఇక 1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో కృష్ణ నటించిన పోరాటం చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో కనిపించారు. బాలనటుడిగా 9చిత్రాలలో కనిపించిన మహేష్ తన తండ్రితో కలిసి హీరో స్థాయికి సమానమైన కీలకపాత్రలు చేశారు. కృష్ణ కి కొడుకుగా, తమ్ముడుగా కూడా మహేష్ నటించి మెప్పించారు.

మరి మహేష్ తన నటవారసుడైన గౌతమ్ ని కూడా బాల నటుడిగా పరిచయం చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గౌతమ్ ఇటీవలే టీనేజ్ లోకి ప్రవేశించాడు.ప్రస్తుతం గౌతమ్ వయసు 13ఏళ్ళు. మహేష్ ఈ వయసుకి నాలుగు చిత్రాలు చేశాడు.

బాలనటుడిగానే ఒక స్థాయి చిత్రాలలో నటించిన మహేష్ కి తరువాత ఆయన పూర్తిస్థాయి హీరోగా ఎదగడానికి ఆ గుర్తింపు, మరియు అనుభవం సహకరించాయి. అందుకే కృష్ణ ముందు చూపుతో మహేష్ ని హీరో స్థాయి పాత్రలలో నటింపజేసి, హీరోగా నిలదొక్కుకోవడానికి మంచి పునాది వేశాడు. మరి గౌతమ్ విషయంలో మహేష్ తండ్రిని ఫాలో అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు