మహేష్ కొత్త మూవీ అప్డేట్..?

Published on Mar 12, 2020 12:40 am IST

మహేష్ సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలైన రెండు నెలలు అవుతుంది. ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కాగా మహేష్ మరో కొత్త చిత్రం ప్రకటించలేదు. గతంలో వంశీ పైడిపల్లితో మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఐతే ఆ చిత్రం హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం ఒప్పదం చేసుకున్న వాణిజ్య ప్రకటనల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఐతే మహేష్ ఫ్యాన్స్ లో ఆయన కొత్త మూవీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఉగాది కానుకగా మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం కలదు. మహేష్ తో మూవీ చేయడానికి అనేక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉండగా, ఆయన స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ ని ఎంచుకోవడమే తరువాయి. కొద్దిరోజులుగా మహేష్ కథలు వింటున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు నూతన సంవత్సరాదిన ఆయన కొత్త మూవీ ప్రకటన చేసే అవకాశం కలదు. మరి చూడాలి మహేష్ ఉగాది కి ఫ్యాన్స్ కి ఎలాంటి అనుభూతిని పంచుతాడో.

సంబంధిత సమాచారం :

More