‘నాపేరు శివమణి నాకు కొంచెం మెంటల్’ అంటూ హ్యాండ్ సమ్ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున అప్పట్లో అదరగొట్టారు. దర్శకుడు పూరి తెరకెక్కించిన శివమణి చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో ఇరగదీశాడు. ఆ చిత్రం తరువాత ఇటీవల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ అనే ఓ మూవీ చేయగా అది ఘోరంగా విఫలమైంది. మళ్ళీ వైల్డ్ డాగ్ అంటూ ఎన్ ఐ ఏ అధికారిగా వస్తున్నాడు. నిజానికి నాగార్జున కెరీర్ లో పోలీస్ అధికారిగా చేసింది చాలా తక్కువ సినిమాలు. వాటిలో శివమణి మాత్రమే హిట్ గా నిలిచింది. ఆవిడా మా ఆవిడే మూవీ కూడా ఫలితం ఇవ్వలేదు. అయినప్పటికీ మరో మారు నాగార్జున ఎన్ ఐ ఏ అధికారిగా వైల్డ్ డాగ్ మూవీ తో సాహసం చేస్తున్నారు. మరి ఈసారైనా నాగార్జున పోలీస్ అధికారి పాత్రలో సూపర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
మాట్నీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు అహీతోష్ సోలొమన్ ఈ చిత్రాన్ని తెరపైకెక్కిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అభిషేక్ రెడ్డి లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొత్తతరానికి చెందిన సాంకేతిక నిపుణులతో సరికొత్త పద్దతిలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని నాగార్జున ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.


