మెగాస్టార్ కోసమైనా నయనతార వస్తోందా ?

Published on Sep 17, 2019 5:15 pm IST

‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు రాజమౌళి, అలాగే కొరటాల శివ, మరియు సైరా చిత్రబృందంతో పాటు ఎలాగూ ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు హాజరు అవుతారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార ఈ ఈవెంట్ కి వస్తోందా ? సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నయనతార, సైరా ప్రమోషన్స్ కు కూడా అలాగే దూరంగా ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా వస్తోందో రాదో చూడాలి. ఇక మరోవైపు రామ్ చరణ్ సినిమా యొక్క హిందీ వెర్షన్ ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు. అక్టోబర్ 2నాటికి విడుదలకు రెడీగా ఉండేందుకు విఎఫ్ఎక్స్ పనులను చకచకా చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More