
వరుస హిట్ అందుకొని ఊపుమీదున్న యంగ్ హీరో నితిన్ – అలాగే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కలిసి ఓ సినిమా చేయాలని గత కొద్ది వారాల క్రితం అనుకున్నారు. త్వరలో అధికారిక ప్రకటనన కూడా రావాలి కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం ఇది ఆగిపోయినట్టు అనిపిస్తోంది.
ప్రస్తుతం నితిన్, అతని టీం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. అలాగే మారుతి గత సినిమా మంచి విజయాన్ని అందివ్వకపోవడంతో ప్రస్తుతం ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం చూస్తున్నాడు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే మారుతి వెంకటేష్ తో ఓ సినిమా చేయాలి. అలాగే కాపీ రైట్ సమస్య వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
నితిన్ ప్రస్తుతం కరుణాకరన్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని తన హోం బ్యానర్ నిర్మిస్తోంది.

