చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజారుకానున్న యెన్.టి.ఆర్?

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజారుకానున్న యెన్.టి.ఆర్?

Published on Jun 6, 2014 3:40 AM IST

Ntr
మొన్న జరిగిన సీమాంద్ర ఎన్నికల్లో గట్టి పోటీని తట్టుకుని చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. తెలుగుదేశం విజయం కోసం కృషి చేసిన ఆ పార్టీ కార్యకర్తలు ఎంతో ఆనందంగా వున్నారు. ఈ ఆనందాన్ని చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజారు అయ్యి రెట్టింపు చేసుకుందామనుకుంటున్నారు.

చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ జూన్ 8న జరగనున్న ప్రమాణస్వీకారానికి హాజారుకానున్నారు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే జూ. ఎన్.టి.ఆర్ ఈ వేడుకకు వస్తున్నాడా అని? ఇంకా ఎటువంటి వార్తా అధికారికంగా ప్రకటించలేదు. టి.డి.పి వర్గాలు కూడా ఏ విధమైన స్పష్టత ఇవ్వలేకపోతుంది

అభిమానులు మాత్రం తమ నందమూరి హీరో ఈ వేడుకకు హాజరుకావాలని కోరుకుంటున్నారు. దీనివలన దూరమైపోతున్న వీరి సంబంధాలు మళ్లీ నిలబెడతాయని ఆశపడుతున్నారు. మరి ఎన్,టి,ఆర్ వస్తాడో రాడో చూడాలి

తాజా వార్తలు