‘ఆపరేషన్ వాలెంటైన్’ వరుణ్ కి బ్రేక్ ని అందిస్తుందా ?

‘ఆపరేషన్ వాలెంటైన్’ వరుణ్ కి బ్రేక్ ని అందిస్తుందా ?

Published on Feb 22, 2024 7:03 PM IST


యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరి ఆదరణ సొంతం చేసుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మార్చి 1 న తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఇటీవల గని, గాండీవధారి అర్జున్ సినిమాలతో ఆడియన్స్ ని నిరాశపరిచాడు వరుణ్.

అయితే మధ్యలో వచ్చిన ఎఫ్ 3 మాత్రం బాగానే ఆడింది. కానీ అది మల్టీస్టారర్ మూవీ కావడంతో ఇప్పుడు వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ తో హీరోగా వరుణ్ బ్రేక్ అందుకుంటారా లేదా అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. అయితే ట్రైలర్ కూడా బాగుండడంతో పాటు మరోవైపు మూవీ టీమ్ ప్రమోషన్స్ బాగా చేస్తోంది. అలానే తప్పకుండా ఈ మూవీ అందరి అంచనాలు అందుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆపరేషన్ వాలెంటైన్ మూవీ హీరోగా వరుణ్ కు ఎంతవరకు బ్రేక్ ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు