ఆ నిర్మాత అభ్యర్థనను రామ్ చరణ్ పట్టించుకుంటాడా ?

ఆ నిర్మాత అభ్యర్థనను రామ్ చరణ్ పట్టించుకుంటాడా ?

Published on Oct 2, 2019 5:19 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి చాలమంది నిర్మాతలు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి జాబితాలో బండ్ల గణేష్ కూడా చేరారు. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన బండ్ల అదే ఊపులో చరణ్ హీరోగా ‘గోవిందుడు అందరివాడే’ తీశారు. కానీ అనుకోకుండా ఆ చిత్రం భారీ పరజయాన్ని చవిచూసింది. దాంతో బండ్ల ప్రతిష్ట మసకబారింది.

అందుకే ఏ హీరోతో అయితే డిజాస్టర్ ఎదురైందో అదే హీరోతో హిట్ సినిమా తీయాలని బండ్ల డిసైడ్ అయ్యారు. నేరుగా ట్విట్టర్ వేదికగా
మళ్లీ మీతో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు. మరి ఆయన అభ్యర్థనను చరణ్ పట్టించుకుంటారో లేదో, ఒకవేళ పట్టించుకుంటే బండ్లకు ఎప్పటికి డేట్స్ ఇస్తారో చూడాలి.

తాజా వార్తలు