ఇప్పటివరకు ఒక స్థాయిలో ఉన్న అంచనాలు సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల తరువాత మరో స్థాయికి చేరాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ కి కావాల్సినంత ఫైర్ ఈమూవీలో మహేష్ చూపించనున్నాడని అర్థం అవుతుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డ్స్ నెలకొల్పుతూ దూసుకెళుతుంది. మహేష్ బాబు ఆటిట్యూడ్, డైలాగ్స్ టీజర్ లో హైలెట్ గా ఉన్నాయి. టీజరే ఈ రేంజ్ లో ఉంటే ఇక మూవీ ఏ స్థాయిలో ఉండనుందని అందరూ భావిస్తున్నారు. కాగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున జరపనున్నారట చిత్ర బృందం.
సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుండగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరంలో గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారట. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ నిర్మిస్తుండగా దేవిశ్రీ స్వరాలు అందించారు. మహేష్ కి జంటగా రష్మిక మందాన నటించిన సంగతి తెలిసిందే.


