డైలాగ్ రైటర్ నుండి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు కొరటాల శివ. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే కొరటాల శివ మాత్రం తన తర్వాత సినిమాను, మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ కోసం ఆయన కమర్షియల్ అంశాలుతో కూడిన ఓ సోషల్ మెసేజ్ సబ్జెక్ట్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తన ప్రతి సినిమాతో ఏదొక మెసేజ్ ఇచ్చే కొరటాల ఈ సినిమాలో కూడా అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ నే ఇవ్వనున్నాడట.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలయిందని సమాచారం. అన్ని అనుకున్న ప్రకారం జరిగితే నవంబర్ లో ఈ చిత్రం అధికారికంగా మొదలు కానుందని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ విషయానికి వస్తే “ఖైదీ నెంబర్ 150 ” చిత్రంతో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టారు. ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


