రజిని లేకుండా షూట్ స్టార్ట్ చేస్తారట !

Published on Sep 20, 2020 10:05 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న తన 168వ సినిమా షూటింగ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అసలు ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తారా.. లేదా.. అని రజిని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే రజిని వయసు రిత్యా షూటింగ్ ఇప్పట్లో చేయకపోతేనే బెటర్ అనే ఫిలింగ్ లో మేకర్స్ ఉన్నారని టాక్. కాగా తాజా అప్ డేట్ ప్రకారం నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. రజిని లేని సీన్స్ ను ముందుగా తీస్తారని.. ఈ సీన్స్ పుర్తయ్యాక మళ్ళీ షూటింగ్ గ్యాప్ ఇచ్చి వచ్చే ఏడాది షూటింగ్ ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.

ఇక రజనీ మొదటిసారి శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే శివ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట.. ఇక రజిని మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. సో.. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More