బన్నీ ఫ్యాన్స్ కి సుక్కు బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా?

బన్నీ ఫ్యాన్స్ కి సుక్కు బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా?

Published on Jan 11, 2020 1:11 PM IST

Allu sukumar

సైలిష్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ సుకుమార్ జన్మదినం నేడు. లాజిక్ తో కూడిన మ్యాజిక్ తో సన్నివేశాలు తెరకెక్కించడం సుకుమార్ స్టైల్. ఈ లెక్కల మాస్టారు కథలు ఎప్పుడూ కొత్తదనం కలిగి ఉంటాయి.తన గత చిత్రం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటిపోయింది. మహేష్ తో మూవీ చేయాలని సుకుమార్ భావించారు, ఐతే అనుకోని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు. కాగా సుకుమార్ ప్రస్తుతం బన్నీతో ఓ చిత్రం చేస్తుండగా, ఇది చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయిందని వినికిడి.

ఐతే సుకుమార్ పుట్టిన రోజు పురస్కరించుకొని మూవీకి సంబంధించి, ఏదైనా అప్డేట్ వస్తుందని బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ ఏమి ఇవ్వకపోవచ్చు. కాగా శేషాచల అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బన్నీ లుక్ కూడా చాలా మాస్ గా ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

తాజా వార్తలు