సునీల్ ఆ చిత్రంతో మళ్లీ కమెడియన్ గా బిజీ కానున్నాడా ?

Published on Jul 23, 2018 9:20 pm IST

కమెడియన్ గా ఫుల్ రైజింగ్ లో ఉన్న సమయంలో హీరోగా టర్న్ తీసుకున్నారు ప్రముఖ నటుడు సునీల్ . అయితే ఇటీవల ఆయన హీరోగా చేసిన సినిమాలు వరుసగా పరాజయాన్ని చవిచూడడం తో ఇప్పుడు మళ్ళి కమెడియన్ గా నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో సునీల్ కమెడియన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందట.

ఇక శ్రీను వైట్ల , సునీల్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘దుబాయ్ శీను , ఢీ , రెడీ ‘ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. సునీల్ పండించిన హాస్యం ఆ చిత్రాలు విజయం సాధించడం లో కీలక పాత్రను పోషించాయి. మరి ఈ సినిమాకు కూడా వీరిద్దరి మ్యాజిక్ వర్క్ ఔట్ అయితే సినిమా సూపర్ హిట్ సాధించి సునీల్ మళ్లీ కమెడియన్ గా బిజీ అవడం ఖాయం.

ఇక గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న నటి ఇలియానా మళ్లీ ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఆగష్టు లో ఈచిత్ర షూటింగ్ ను పూర్తి చేసి సెప్టెంబర్ 28 న ఈసినిమాను ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం :