ఆ హీరోయిన్‌ ‘ఇందిరా గాంధీ’గా కనిపించబోతుందా ?

Published on May 29, 2019 2:30 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కాగా ప్రస్తుతం `కేజీఎఫ్’ సీక్వెల్ శరవేగంగా తెరకెక్కుతుంది.

అయితే తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో భారత ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయట. అయితే ఇందిరా గాంధీ పాత్రలో మాజీ స్టార్ హీరోయిన్‌ రవీనా టండన్‌ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇందిరా గాంధీకి రవీనా టండన్‌ కి మధ్య కొంత దగ్గర పోలికలే ఉంటాయి. అందుకే ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఇక కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) అని అర్థం. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.కేజీఎఫ్ గ‌నుల‌పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. మరి సెకెండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More