‘దేవర’ రిలీజ్ పై ఆరోజున క్లారిటీ రానుందా ?

‘దేవర’ రిలీజ్ పై ఆరోజున క్లారిటీ రానుందా ?

Published on Feb 15, 2024 3:02 AM IST

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లింగ్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లపాటు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు. దానితో దేవర షూటింగ్ కి బ్రేక్ తప్పదని, అందుకే దేవర వాయిదా పడే ఛాన్స్ ఉందని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మార్చి 8 న శివరాత్రి సందర్భంగా ఈ మూవీ యొక్క రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని అంటున్నారు. మరి దేవర పక్కాగా అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే అప్పటివరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు