లేటెస్ట్ : పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” సాంగ్ కి టైం ఖరారు

లేటెస్ట్ : పవర్ఫుల్ పోస్టర్ తో “దేవర” సాంగ్ కి టైం ఖరారు

Published on May 18, 2024 11:44 AM IST


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర పార్ట్ 1” కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి మొదటి పాట కోసం అభిమానులు మ్యూజిక్ లవర్స్ కూడా ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అది ఎట్టకేలకి ఎన్టీఆర్ బర్త్ డే బ్లాస్ట్ గా రాబోతున్నట్టుగా మే 19ని మేకర్స్ డేట్ ఫిక్స్ చేసేసారు.

ఇక నిన్ననే తారక్ స్వయంగా రిలీజ్ చేసిన ప్రోమోతో మరిన్ని అంచనాలు నెలకొనగా ఇప్పుడు పవర్ఫుల్ పోస్టర్ తో సాంగ్ రిలీజ్ కి సమయం ఖరారు అయ్యింది. రక్తంతో ఎర్రగా మారిపోయిన ఎర్ర సముద్రపు ఒడ్డున నడుస్తున్న దేవర పోస్టర్ తో మరింత హైప్ ఎక్కించేలా రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అందించారు. దీనితో ఈ సాంగ్ పై అంచనాలు మరింత రేకెత్తుతున్నాయి. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఈ అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు