డీసెంట్ రన్ టైం తో సెన్సార్ పూర్తి చేసుకున్న “ఆ ఒక్కటీ అడక్కు”

డీసెంట్ రన్ టైం తో సెన్సార్ పూర్తి చేసుకున్న “ఆ ఒక్కటీ అడక్కు”

Published on Apr 30, 2024 10:00 AM IST

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ హీరోగా మళ్ళీ ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో రాబోతున్నాడు. ఆ చిత్రమే “ఆ ఒక్కటీ అడక్కు”. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హిట్ చిత్రం టైటిల్ తో వస్తున్నా ఈ చిత్రానికి దర్శకుడు అంకం మల్లి పని చేయగా రీసెంట్ గా వచ్చిన టీజర్, ట్రైలర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు.

అలాగే ఈ చిత్రానికి 2 గంటల 14 నిమిషాల డీసెంట్ నిడివి ఖరారు అయ్యింది. మరి ఈ చిత్రం ఎలాంటి ట్రీట్ ని అందిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా నటించగా బిగ్ బాస్ ఫేమ్ అరియనా, హర్ష చెముడు, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే గోపి సుందర్ సంగీతం అందించాడు. చిలక ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ మే 3న రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు