ఇటీవల కోలీవుడ్ లో టూరిస్ట్ ఫ్యామిలీ అంటూ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో సత్తా చాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అబీషీన్ జీవింత్ హీరోగా నటించిన లేటెస్ట్ రోమ్ కామ్ చిత్రమే “విత్ లవ్”. టాలీవుడ్ లో ఛాంపియన్ సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ ఫీమేల్ లీడ్ గా ఈ సినిమాలో నటించింది. ఇక థియేటర్లులో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది.
ఈ సినిమాని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఈ మార్చ్ 6 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈ కొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఇక ఈ సినిమాకి సియన్ రోల్డన్ సంగీతం అందించగా ఎం ఆర్ పి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
