ఈ బాలీవుడ్ బిగ్ స్టార్ తో మరో లెవెల్ కి “కార్తికేయ 2”.!

Published on Mar 7, 2021 3:50 pm IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు చందూ మొండేటి తో చేసిన థ్రిల్లర్ చిత్రం “కార్తికేయ” కూడా ఒకటి. ఆరేళ్ళ కితం విడుదల కాబడిన ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన మేకర్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నామని తెలిపారు. మరి దాని ప్రకారం ఆ ఊహించని బిగ్ అప్డేట్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన బిగ్గెస్ట్ స్టార్స్ మరియు వెర్సిటైల్ నటులలో లో ఒకరైన అనుపమ్ ఖేర్ ను “ధన్వంత్రి”గా పరిచయం చేస్తూ ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు.మొట్ట మొదటిగా తెలుగులో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఒక్క అనౌన్సమెంట్ తో ఇపుడు ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కి వెళ్ళింది అని చెప్పాలి. మరి ఇందులో ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :