చరణ్ తో వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్న శంకర్..? ఊహించని గాసిప్ వచ్చిందే..

Published on Apr 8, 2021 7:01 am IST

ఇప్పుడు ఇండియన్ సినిమా వద్ద భారీ హైప్ తెచ్చుకున్న అతి తక్కువ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియన్ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ ల కాంబోలో సెట్టయిన ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఇది అనౌన్స్ కావడంతోనే అనేక గాసిప్స్ ను కూడా తెచ్చుకుంది. మరి ఇప్పుడు అలా ఓ అస్సలు ఊహించని వార్త హల్చల్ చేస్తోంది..

మరి దాని ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడట. అంతే కాకుండా శంకర్ ఈ రోల్ ను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇది ఓ పొలిటికల్ స్క్రిప్ట్ అని ఆ మధ్యన టాక్ కూడా వచ్చింది మరి దాని పరంగా సల్మాన్ పోలీసు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఒకవేళ నిజం అయితే పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమానే ఇది అని చెప్పాలి..

సంబంధిత సమాచారం :