వరస్ట్ డే ఎవర్ – ట్విట్టర్లో సమంత

Samantha

ఈ రోజు సమంతకు ప్రతి విషయంలోనూ, పనిలోనూ చుక్కేదురవుతుంది. ‘అంజాన్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరుకావడానికి బయలుదేరింది సమంత. చివరి నిముషంలో ఫ్లైట్ డిలే అయ్యింది. తన లగేజ్ మొత్తం ట్రాన్సిట్ లో ఉండిపోయింది. తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యింది. మూడ్ మొత్తం పాడైపోయింది. ఒకదాని వెంట మరొకటి… సవ్యంగా ఒక్క పని కూడా జరగడం లేదు. కోపంతో వరస్ట్ డే ఎవర్ అంటూ ట్విట్టర్లో తన అసహనాన్ని వ్యక్తపరిచింది.

సమంత.. రభస సాంగ్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళింది. అక్కడ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాను అంటూ సమంత సాంగ్ షూట్ ప్రారంభం అయిన మొదటి రోజు ట్విట్ చేసింది. నిన్నటితో సాంగ్ షూటింగ్ పూర్తయింది.

Exit mobile version