హన్సిక ట్రిప్ ని డిస్టర్బ్ చేసిన ‘పవర్’ షూటింగ్

హన్సిక ట్రిప్ ని డిస్టర్బ్ చేసిన ‘పవర్’ షూటింగ్

Published on Aug 4, 2014 7:19 PM IST

hansika

అందాల్ భామ హన్సిక గత కొద్ది రోజులుగా యూరప్ లో తన హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. ఆ ట్రిప్ కి సంబందించిన ఫోటోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నిన్న తన బర్త్ డే ని కూడా పారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర చేసుకుంది. ప్రస్తుతం తను తన ట్రిప్ ని ఫినిష్ చేసుకొని రవితేజ ‘పవర్’ షూటింగ్ కోసం ఇండియా బయలు దేరింది.

‘అవును నా యూరప్ ట్రిప్ ని కట్ చేసి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాను. ఇది బాధగా ఉంది కానీ మనం చేసే పనే మనకు దేవుడు. పారిస్ లో చివరి రెండు రోజుల్ని పారిస్ లో బాగా ఎంజాయ్ చెయ్యాలని’ ట్వీట్ చేసింది.

ఇటీవలే బల్గేరియాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘పవర్’ టీం త్వరలోనే హైదరాబాద్లో ఓ కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. హన్సికతో పాటు రెజీన కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు