క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బబ్లీ బ్యూటీ రాశీఖన్నా, అలాగే ఐశ్వర్యా రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్ గా ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రాబోతున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి కూల్ కంపోజర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ గత చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండ కు హిట్ ఇస్తోందా.. టైటిల్ అయితే క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా కోసం రాశీఖన్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పిందట, అలాగే ఐశ్వర్యా రాజేష్ కూడా తన రోల్ కు డబ్బింగ్ చెబుతుందట. ఏమైనా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం హీరోయిన్స్ వరుసగా డబ్బింగ్ చెబుతున్నారు.