వీకెండ్ నిరుత్సాహంగా ముగించిన విజయ్ దేవరకొండ.

వీకెండ్ నిరుత్సాహంగా ముగించిన విజయ్ దేవరకొండ.

Published on Feb 17, 2020 7:50 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఓపెనింగ్స్ పరంగా కూడా అంత చెప్పుకో దగ్గ వసూళ్లు రాబట్టని ఈ చిత్రం శనివారం మరియు ఆదివారం కూడా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించలేకపోయింది. ఆదివారం నైజాంలో వరల్డ్ ఫేమస్ లవర్ 65లక్షల షేర్ వసూలు చేసింది. ఇక నైజాంలో ఈ వీకెండ్ ముగిసేనాటికి వరల్డ్ ఫేమస్ లవర్ కేవలం 3.51 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. దాదాపు 10కోట్లకు నైజాం రైట్స్ అమ్ముడైన నేపథ్యంలో ఈ చిత్రం భారీ నష్టాలు మిగిల్చేలా కనబడుతుంది.

ఇక ఆంధ్రా, ఓవర్సీస్ లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కే ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించారు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు