విజయ్ కోసం విజయ్ సేతుపతి వస్తున్నాడు

విజయ్ కోసం విజయ్ సేతుపతి వస్తున్నాడు

Published on Jan 29, 2020 12:18 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఏకంగా నలుగురు హీరోయిన్స్ తో విజయ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేస్తుండగా దర్శకుడు క్రాంతి మాధవ్ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. వచ్చే నెల 14న వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు ఈ చిత్ర తమిళ టీజర్ విడుదల కానుంది. వరల్డ్ ఫేమస్ లవర్ తమిళ టీజర్ ని వెర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్నారు. నేటి సాయంత్రం 6:00 గంటలకు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర తమిళ టీజర్ విడుదల అవుతుంది.

రాశి ఖన్నా, క్యాథెరిన్ థెరిస్సా, ఐశ్వర్య రాజేష్ మరియు ఇసబెల్లా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కే ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. దర్శకుడు పూరి తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు