వరల్డ్ వైడ్ ‘కింగ్డమ్’ 3 రోజుల వసూళ్లు ఎంతంటే!

king

ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రమే “కింగ్డమ్”. విడుదలకి ముందు భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకున్నప్పటికీ స్ట్రాంగ్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటుంది.

మరి ఇలా మూడు రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏకంగా 67 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. దీనితో కింగ్డమ్ తో విజయ్ మరోసారి అదరగొడుతున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు.

Exit mobile version