వరల్డ్ వైడ్ “టిల్లు స్క్వేర్” 5 రోజుల సాలిడ్ వసూళ్లు..!

వరల్డ్ వైడ్ “టిల్లు స్క్వేర్” 5 రోజుల సాలిడ్ వసూళ్లు..!

Published on Apr 3, 2024 11:01 AM IST


యంగ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మరోసారి ఆడియెన్స్ ని మెప్పించి భారీ వసూళ్లు అందుకుంటుంది. చిత్ర యూనిట్ ముందు గానే ఊహించినట్టుగా 100 కోట్ల గ్రాస్ దిశగా ఈ చిత్రం దూసుకెళ్తుండడం విశేషం.

అయితే ఈ చిత్రం ఇపుడు వరల్డ్ వైడ్ గా 5 రోజుల రన్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రన్ తో ఈ చిత్రం 85 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరుకుంది. దీనితో టిల్లు గాడి హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం యూఎస్ సహా ఇతర ఓవర్సీస్ మార్కెట్ లలో సాలిడ్ నంబర్స్ ని రిజిస్టర్ చేస్తుంది.

ఇలా ఓవరాల్ గా మాత్రం భారీ వసూళ్లనే ఈ చిత్రం అందుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్, అచ్చు అలాగే రామ్ మిర్యాల లు సంగీతం అందించగా నేహా శెట్టి క్యామియోలో నటిచింది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు