మరో బయోపిక్ కు మాటలు రాస్తున్న రైటర్ !

మరో బయోపిక్ కు మాటలు రాస్తున్న రైటర్ !

Published on Mar 28, 2018 8:04 PM IST

సిరియల్స్ తో కెరిర్ ప్రారంభించి ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలకు రైటర్ గా పని చేస్తున్న బుర్రా సాయి మాధవ్ ప్రస్తుతం సావిత్రి జీవితాన్ని ఆధారంగా చేసుకొని చేసున్న మహానటి సినిమాకు మాటలు రాసారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు మాటలు రాయబోతున్నారు. తేజ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా రేపు ప్రారంభం కానుంది. బాలయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ రెండు సినిమల తరువాత మరో బయోపిక్ కు ఈ రైటర్ మాటలు రాయబోతున్నారు. టైగెర్ నాగేశ్వర రావ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించబోతున్న సినిమాకు సాయి మాధవ్ మాటలు రాసున్నారు. ఈ సినిమాలో రానా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత.

తాజా వార్తలు