ప్రముఖ రచయితపై అట్రాసిటీ కేసు.

ప్రముఖ రచయితపై అట్రాసిటీ కేసు.

Published on Jun 2, 2020 4:42 PM IST

సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వర రావు కరోనా వైరస్ పై రాసిన ఓ పద్యం ఆయన్ని చిక్కులోకి నెట్టింది. ఆయనపై పై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదైంది. అంటరానితనాన్ని ప్రోత్సహించే విధంగా, ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా జొన్న విత్తుల పద్యం రాశారంటూ, తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాం ప్రసాద్ హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే జొన్న విత్తుల మాత్రం తన పద్యంలో ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు లేవని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మానవజాతి మడికట్టుకుని ఉంది. మడి అంటే నువ్వు నన్ను తాకవద్దు అని అర్థం వస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది కూడా ఇదేనని.. ఎవరినో కించపరచాలని తాను ఈ పద్యం పాడలేదని అంటున్నారు. ఇక జొన్నవిత్తుల వర్మ జీవిత కథ ఆధారంగా ఆర్ జి వి(రోజూ గిల్లే వాడు) అనే ఓ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు