రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి చిత్రం ను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మించిన వెబ్ సిరీస్ యక్షిణి. సోషియో ఫాంటసీ డ్రామాగా, హార్రర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సిరీస్ లో వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కోట బొమ్మాళి పీ.ఎస్ ఫేమ్ దర్శకుడు తేజ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.
ఈ వెబ్ సిరీస్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. థ్రిల్లింగ్ మరియు హార్రర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. జూన్ 14, 2024 నుండి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి