నాలో నటిని కృష్ణారెడ్డి గుర్తించారు : ‘యమలీల 2’ హీరోయిన్

నాలో నటిని కృష్ణారెడ్డి గుర్తించారు : ‘యమలీల 2’ హీరోయిన్

Published on Nov 11, 2014 11:40 PM IST

Diah-Nicholas
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘యమలీల 2’ సినిమా ద్వారా సౌత్ ఆఫ్రికన్ మోడల్ దియా నికోలస్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. తనలో నటిని దర్శకుడు కృష్ణారెడ్డి బయటకు తీసుకొచ్చారు అని ఈ అందాల భామ చెప్తుంది.

హీరోయిన్ అవుదామని ఇండియాకు రాలేదు. సరదాగా ఇండియాకు ట్రిప్ వేసినప్పుడు కాస్టింగ్ ఏజెంట్ నన్ను రోడ్ మీద చూసి కృష్ణారెడ్డి వద్దకు తీసుకెళ్ళారు. అప్పుడు నాకు సినిమాలలో నటించాలనే ఆసక్తి లేదు. నాలో నటిని మా దర్శకుడు గుర్తించారు. నేను నటించగలను అనే నమ్మకం కలిగించారు. షూటింగ్ జరిగే సమయంలో నేను ఎక్కువ టేక్స్ తీసుకున్నా.. సహనంతో, ఓర్పుతో వెయిట్ చేసేవారు. అని ‘యమలీల 2’ హీరోయిన్ దియా నికోలస్ తెలిపింది.

కెవి సతీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటించారు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు