హిందీలో భారీ ఆఫర్ సంపాదించుకున్న యామి గౌతం

హిందీలో భారీ ఆఫర్ సంపాదించుకున్న యామి గౌతం

Published on May 9, 2014 12:07 AM IST

Yami_Gautham

విక్కీ డోనార్, టోటల్ సియప్పా వంటి బాలీవుడ్ సినిమాలలో మెరిసిన యామీ గౌతం హిందీలో మంచి జోరుమీద వుంది. ప్రస్తుతం ప్రభుదేవా తెరకెక్కిస్తున్న యాక్షన్ జాక్సన్ సినిమాలో ఒక పాత్రలో నటించడమే కాక మరో పెద్ద ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్ర పోషించనుంది

ఇప్పుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రానున్న సినిమాలో యామి హీరో వరుణ్ ధావన్ సరసన నటించనుంది. ఇటీవలే వరుణ్ నటించిన మైన్ తేరా హీరో విడుదలైంది. హుమా ఖురేషి మరియు నవజుద్దిన్ సిద్దిక్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు

నువ్విలా సినిమా తరువాత ఈ భామ అల్లు శిరీష్ నటించిన గౌరవంలో నటించింది. ఈ అమ్మడి తాజా చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్ విడుదలకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదలకావచ్చని అంచనా

తాజా వార్తలు