“యశ్ 19” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

“యశ్ 19” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Dec 3, 2023 7:30 PM IST

కేజీఎఫ్ చిత్రం తో కన్నడ సినీ పరిశ్రమ దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. హీరో యశ్ ఈ చిత్రం తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం అనంతరం వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం తర్వాత హీరో యశ్ ఇప్పటి వరకూ కూడా ఎలాంటి సినిమాను ప్రకటించలేదు.

హీరో యశ్ తన నెక్స్ట్ మూవీ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్షణ కి ఫుల్ స్టాప్ పడింది అని చెప్పాలి. రాక్ స్టార్ యశ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం అయిన ఇన్ స్టాగ్రామ్ లో తన డీపీ ను చేంజ్ చేయడం జరిగింది. లోడింగ్ అంటూ ఇంగ్లీష్ లో ఉన్న ఫోటో ను డీపీ గా పెట్టుకున్నారు యశ్. అయితే ఇది యశ్ 19 కి సంబందించిన అప్డేట్ అయ్యి ఉంటుంది అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

యశ్ కొత్త చిత్రం ఈ నెల చివరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీని పై మరింత క్లారిటీ రావాలంటే వేచి ఉండాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు